A Woman harmed her Husband and decided to implement the plastic surgery plan later for continuing the extra-marital affair.
ప్రేమించి పెళ్ళి చేసుకొన్న భర్తను ప్రియుడితో రాసలీలలు సాగించేందుకు హత్య చేసింది.టీవి సీరియళ్ళు, హర్రర్ సినిమాలను తలపించే రీతిలో భర్తను హత్య చేసింది స్వాతి. భర్త రూపు రేఖలను పోలి ఉన్న ప్రియుడు రాజేష్‌తో జీవితాన్ని కొనసాగించాలని భావించింది. కుటుంబసభ్యులకు వచ్చిన అనుమానాలు, టెక్నాలజీ సహయంతో పోలీసులు ఈ కేసును చేధించారు. అచ్చు ఎవడు సినిమా తరహలో తతంగాన్ని నడిపారు ప్రేమికులు. కానీ, పోలీసులకు చిక్కారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో సుధాకర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌పై నవంబర్ 27వ, తేదిన యాసిడ్ దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే యాసిడ్ దాడి ఘటనపై పోలీసులు లోతుగా విస్తరిస్తే అసలు విషయం బట్టబయలైంది.ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన స్వాతి, భర్త స్థానంలో ప్రియుడిని ఉంచి కుటుంబసభ్యులతో అందరిని నమ్మించింది.అయితే ఎట్టకేలకు నిందితులను సాక్ష్యాధారాలతో రుజువు చేశారు.